మండల కేంద్రంలో ఏబీ రోడ్డు నుంచి మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లే దారిలో పారిశుద్ధ్య పనులు చేపట్టామని పంచాయతీ కార్యదర్శి జయమోహన్ పాడి తెలిపారు. ఈ దారిలో డ్రైనేజీ వ్యవస్థ పూడుకుపోయి రోడ్డు పైకి మురికి నీరు ప్రవహిస్తుందని అన్నారు. ఎంపీడీవో పైడి శ్రీనివాసరావు, ఈఓపిఆర్డి శ్రీనివాసులు సూచనల మేరకు సర్పంచ్ ముగడ దివాకర్ నాయుడు సహకారంతో పారిశుద్ధ్య పనులు చేపట్టామన్నారు. డ్రైనేజీలో పూడికలు తొలగించి పూడిక వ్యర్ధాలు దూరంగా తరలించామన్నారు. డ్రైనేజీ వ్యవస్థను సక్రమంగా వినియోగించుకోవాలని స్థానికులకు సూచనలు చేశారు.