పంట పొలాల్లో నీటి నిల్వలు లేకుండా చూడండి

50చూసినవారు
పంట పొలాల్లో నీటి నిల్వలు లేకుండా చూడండి
పొలాల్లో వర్షపు నీరు నిల్వ లేకుండా చూడాలని ఎల్. ఎన్. పేట మండల వ్యవసాయ అధికారి పైడి లతాశ్రీ రైతులకు సూచించారు. గ్రామ సచివాలయ వ్యవసాయ సహాయకులతో తన కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. నారుమడులు సిద్ధం చేసుకున్న రైతులు పొలాల్లో నీరు నిలిచి ఉంటే మొలక శాతం తగ్గిపోతుందన్నారు. వ్యవసాయ శాఖ సిబ్బంది గ్రామాలకు వెళ్లి పంట దిగుబడిపై రైతులకు సూచనలు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్