హనుమత్ జయంతి సందర్బంగా పాతపట్నం శ్రీరామ పంచవటి క్షేత్రంలో గల పంచముఖ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. ఉదయం క్క్షీరాభిషేకం, అనంతరం ఆకుపూజ ప్రధాన అర్చకులు ధర్మకర్త శ్రీ ఎం.వి.యస్. శర్మగారి చేతుల మీదుగా జరిపించబడింది. సాయంత్రం సామూహిక హనుమాన్ చాలీసా పఠనం ఉంటుంది. ఈ కార్యక్రమాలు 5రోజులు హనుమత్ జయంతి వరకు జరుగుతాయని తెలియజేసారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.