శ్రీకాకుళం పట్టణంలోని ఫ్రెండ్స్ కాలనీలో రోడ్డుకి అడ్డంగా పడి ఉన్న మర్రి చెట్టుని మూడు రోజులుగా తొలగించే నాథుడే కరువయ్యాడు. బుధవారం విసిన గాలి వానకి మర్రి చెట్టు కాలనీ రహదారికి అడ్డుగా పడి పోయింది. కాలనీ వాసులు గురువారం మున్సిపాలిటీ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మూడు రోజులైనా చెట్టు తొలగించక పోవడంతో స్థానికులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. రాకపోకలకు ఇబ్బందిగా ఉందని వాపోతున్నారు.