శ్రీకాకుళం: వీడనున్న మహిళ మర్డర్ మిస్టరీ

62చూసినవారు
శ్రీకాకుళం: వీడనున్న మహిళ మర్డర్ మిస్టరీ
శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రాపురంలో మంగళవారం వృద్ధురాలు దాలమ్మ(68) దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో అనుమానితుడు బల్లి రామును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంగారు నగల కోసమే హత్య చేశాడని భావిస్తున్నారు. రెండు తులాల పుస్తెలతాడును స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. పూర్తి వివరాలు గురువారం వెల్లడిస్తామని అదనపు ఎస్పీ బుధవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్