ఏపీఎస్ ఆర్టీసీ హెవీ డ్రైవింగ్ స్కూల్లో 21వ బ్యాచ్ హెవీ డ్రైవింగ్ శిక్షణకు లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చని శ్రీకాకుళం జిల్లా ప్రజా రవాణా అధికారి ఏ. విజయ్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 3వ వారం నుంచి 21వ బ్యాచ్ లో శిక్షణ పొందేందుకు16 మందికే అవకాశం ఉందన్నారు. ఇతర వివరాల కోసం 9441161051, 9390886033 నెంబర్లను సంప్రదించాలన్నారు.