ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత గ్రానైట్ ఫ్యాక్టరీలకు ఎగుమతులు, దిగుమతులను నిలిపివేయడంతో పలువురు కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. గత కొంతకాలంగా పాతపట్నం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న గ్రానైట్ ఫ్యాక్టరీలలో పనులు జరగడం లేదు. దీంతో ఫ్యాక్టరీ యజమానులు మరల పనులు ప్రారంభించి అక్కడ పని చేస్తున్న కూలీలకు ఆర్థిక స్వాలంబన కల్పించాలని పలువురు గ్రానైట్ కూలీలు శుక్రవారం యజమానులను కోరారు.