మెలియాపుట్టి మండల వ్యాప్తంగా కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. శుక్రవారం సాయంత్రం ఏకధాటిగా గాలులు వీస్తూ భారీ వర్షం మెలియాపుట్టి మండల చుట్టుప్రక్కల గ్రామాలైన మర్రిపాడు, కొసమాల, చాపర తదితర గ్రామాల్లో కురిసింది. సాయంత్రం వేళ ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. ఏది ఏమైనాప్పటికీ పంట పొలాల్లో నీరు చేరడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ వర్షం ఉపయోగకరమని రైతులు తెలిపారు.