ఎల్.ఎన్.పేట మండలం తురకపేట గ్రామం సమీపంలో వంతెన నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. కడవలవాని గెడ్డ వద్ద ఉన్న వంతెన లోతట్టుగా ఉండటంతో వరద నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ సమస్యను గుర్తించిన పాతపట్నం ఎమ్మల్యే మామిడి గోవిందరావు రూ.67 లక్షల నిధులు మంజూరు చేశారు. ప్రస్తుతం పనులు చురుగ్గా సాగుతున్నట్లు అధికారులు తెలిపారు.