రేగిడి ఆమదాలవలస మండలం అంబాడ గ్రామంలో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందారు. అదే గ్రామానికి చెందిన వెంకటేశ్ మడ్డువలస కుడి కాలువలో గురువారం సాయంత్రం కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.