వంగర మండలంలో బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తన ద్రోని ప్రభావం కారణంగా శుక్రవారం రాత్రి నుండి ఒక మోస్తారు వర్షం పడుతుంది. ఈ వర్షం వల్ల నిత్య జీవనానికి కొంచెం ఆటంకం కలిగినప్పటికీ, మొక్కజొన్న, వరి నారుమడికి ఎంతగానో ఉపయోగపడుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.