రాజాంలో ప్రభుత్వ హైస్కూల్లో బుధవారం 'జై మాల ఛలో శ్రీకాకుళం' గోడపత్రికను బుధవారం ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఆవిష్కరించారు. ఈనెల 29 ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో జరగబోయే ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక సభకు మాలలు అందరు తరలిరావాలని, మాలలు ఉనికిని చాటుకునే సమయం ఆసన్నమైందని అధ్యక్షులు ధర్మాన కృష్ణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు, కార్యదర్శులు, సలహాదారులు, సభ్యులు పాల్గొన్నారు.