కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, అవ్వతాతలకు ఒకటో తేదీకి నాలుగు వేలు పెంచిన పింఛన్ అందజేసి వారిలో ఆనందం నింపుతోందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. గార మండలం కొత్తూరు సైరిగంలో ఎమ్మెల్యే శంకర్ మంగళవారం పింఛన్లను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఒకటో తేదీనే పేదలకు పింఛన్లు అందజేస్తున్నట్లు వివరించారు. ఆసరాలేని వృద్ధులకు, నిరాశ్రయులకు పింఛన్ అందజేసి ఆదుకుంటుందని చెప్పారు.