శ్రీకాకుళం జిల్లాలోని పలు దేవాలయాలలో దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి మంగళవారం సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. ఏప్రిల్ నెలలో ఎచ్చెర్ల మండలం కుంచాల కుర్మయ్యపేట రాజరాజేశ్వరి ఆలయంలో చోరీతో పాటు పలు ఆలయాల్లో చోరీలు చేసినట్టు వివరించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.