తల్లిదండ్రులు పక్కన ఉండడం లేదని మనస్తాపం చెంది యువతి బలవన్మరణానికి పాల్పడింది. శ్రీకాకుళానికి చెందిన యువతి (18) గుంటూరులో బీటెక్ చదువుతుంది. తల్లిదండ్రులపై బెంగతో బాధపడుతూ ప్రతి రోజు వారికి ఫోన్ చేసి రమ్మని చెప్పేది. మూడు రోజుల క్రితం నాన్నతో పాటు తల్లిని కూడా రమ్మని చెప్తే కొన్ని రోజుల్లో వస్తామని తల్లి చెప్పింది. సంతృప్తి చెందని ఆమె మనస్థాపానికి గురై శుక్రవారం కళాశాల పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.