కొత్తూరు మండలం వసప గ్రామ సమీపంలో శనివారం అర్ధరాత్రి ఘోర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన 21 ఏళ్ల లుకలాపు మిన్నారావును గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఆదివారం ఉదయం మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం తెలుసుకున్న సీఐ చింతాడ ప్రసాద్ ఘటనాస్థలానికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు.