ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ను ఏపీ ప్రభుత్వం రాష్ట్ర పీయూసీ (ప్రభుత్వ రంగ సంస్థలు) చైర్మన్‌గా నియమించిన సందర్భంగా బుధవారం ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధి హడ్కోకాలనీకి చెందిన టిడిపి నాయకులు అన్నెపు కృష్ణకాంత్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన, కూన రవికుమార్ సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ప్రజల సంక్షేమానికి ఎంతో కృషి చేస్తున్నారని అభిప్రాయపడ్డారు.