ఆమదాలవలస మున్సిపల్ కార్యాలయంలో 'స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర' కార్యక్రమంలో శనివారం ఎమ్మెల్యే కూన రవి కుమార్ పాల్గొన్నారు. మున్సిపల్ ప్రాంగణంలో మొక్కలు నాటి, పరిసరాల పరిశుభ్రత ప్రాముఖ్యతను వివరించారు. పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యమన్నారు. మొక్కలు జీవకోటికి ప్రాణాధారమని అన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ శివ్వాల సూర్యం, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తమ్మినేని గీత విద్యాసాగర్ పాల్గొన్నారు.