ఆంధ్రప్రదేశ్ శాసనసభలోని ఫైనాన్షియల్ కమిటీలను నియమిస్తూ మంగళవారం శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ రంగ సంస్థల సమితి (పియూసి) అధ్యక్షునిగా ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఎంపికపై ఆమదాలవలస టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.