శ్రీకాకుళం నగరంలోని స్థానిక అరసవల్లి ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణ స్వామివారి అనివెట్టి మండపంలో శుక్రవారం ఉదయం ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో ఆలయ వేదపండితులు మరియు అర్చకుల ద్వారా మాసశివరాత్రి మహాపర్వం శివ పంచాయతన సహిత లింగార్చన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎస్. చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.