ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాలుగా అభివృద్ధి పరచాలని చంద్రబాబు సారథ్యంలోని కూటమి భావిస్తుంది. ఆ క్రమంలో కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. సుదీర్ఘ తీర ప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్‌ను లాజిస్టిక్ హబ్‌గా అభివృద్ధికి ఉప్పు భూముల వినియోగాన్ని గుర్తించి వాటిని ఆప్టిమైజ్ చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర షిప్పింగ్ శాఖ మంత్రి సోనోవాల్ దృష్టికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తీసుకు వెళ్లారు.