ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్ 21వ బ్యాచ్ కు దరఖాస్తులు ఆహ్వానం

76చూసినవారు
ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్ 21వ బ్యాచ్ కు దరఖాస్తులు ఆహ్వానం
ఏపీఎస్ఆర్టీసీ హెవీ డ్రైవింగ్ స్కూల్ నందు 21వ బ్యాచ్ హెవీ డ్రైవింగ్ శిక్షణకు గాను లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగినటువంటి వారు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా ప్రజా రవాణా అధికారి ఏ.విజయ్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ నెల 3వ వారంలో ప్రారంభమయ్యే 21వ బ్యాచ్ లో 16 మందికే అవకాశం ఉందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం 9441161051 సంప్రదించాలన్నారు.

సంబంధిత పోస్ట్