మెరుగైన ప్రదర్శనకు ప్రశంస పత్రాలు ప్రదానం

53చూసినవారు
మెరుగైన ప్రదర్శనకు ప్రశంస పత్రాలు ప్రదానం
స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో మెరుగైన ప్రదర్శనతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన జిల్లా ఆర్మ్డ్ పోలీసు అధికారులు, బ్యాండ్ సిబ్బంది కళాకారులను జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి ప్రశంసించారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి ఒక్కరికి పేరుపేరునా ప్రశంస పత్రాన్ని అందించి ప్రత్యేకంగా అభినందించారు. పరేడ్ కమాండర్ శేషాద్రి, అక్షయ కుమార్, నీలిమతో పాటు పోలీసు సిబ్బంది, హోం గార్డులు 64 మంది ఉన్నారు.

సంబంధిత పోస్ట్