అరసవల్లి: భక్తులకు అన్న ప్రసాదాలు అందించిన మాజీ ఎమ్మెల్యే

67చూసినవారు
శ్రీకాకుళం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయానికి రథసప్తమి సందర్భంగా తరలివచ్చిన భక్తులకు మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి బాసటగా నిలిచారు. ఈ సందర్భంగా మంగళవారం ఆలయానికి వచ్చిన భక్తులకు అన్నప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఏడాది తాను అధికారంలో ఉన్నా లేకపోయినా సూర్యనారాయణ స్వామి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నానని అన్నారు.

సంబంధిత పోస్ట్