అరసవల్లి శ్రీ సూర్య నారాయణస్వామి దేవాలయంలో శుక్రవారం ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని స్వామి వారి ఉత్సవ విగ్రహాలను అశ్వవాహనంపై శుక్రవారం రాత్రి తిరువీధి మహోత్సవం ఘనంగా నిర్వహించారు. మహావిష్ణువు గరుడ వాహనారూడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందని ఆలయ అర్చకులు శంకర శర్మ తెలిపారు. ఆలయ ఈవో భద్రాజీ ఉన్నారు.