రథసప్తమిని పురస్కరించి అరసవిల్లి సూర్యనారాయణ స్వామికి ప్రభుత్వం తరఫున దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వినయ్ చంద్ పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆయన వెంట జిల్లా కలెక్టర్ స్వప్నిక దినకర్ పండ్కార్, ఎస్పీ మహేశ్వర రెడ్డి పాల్గొన్నారు. శ్రీకాకుళంలో రథసప్తమి వేడుకలు భక్తుల విశేష పాల్గొనుతో ఘనంగా జరుగుతున్నాయి.