సింగుపురం వ్యవసాయ రైతు సేవా కేంద్రాన్ని జిల్లా వ్యవసాయ అధికారి పరిశీలించారు. శనివారం సింగుపురం పంచాయతీలో ఉన్న రైతు సేవా కేంద్రాన్ని జిల్లా వ్యవసాయ అధికారులు త్రినాథ స్వామి, ఏడీఏ రజిని, మండల వ్యవసాయ అధికారి ఉషాకుమారి రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ వ్యవసాయ స్థితిగతులపై రైతులతో చర్చించారు. సమావేశంలో వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.