నాతవలస టోల్ ప్లాజా వద్ద ఆదివారం ప్రమాదవశాత్తు మంటల్లో కారు దగ్ధమైంది శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వెళ్తున్న కారు నాతవలస టోల్ ప్లాజా వద్ద ఫాస్టాక్ రీఛార్జ్ చేయడం కోసం కారును పక్కకు తీసి ఆపారు. దీంతో కార్లో ఉన్న ప్రయాణికులు అందరూ కూడా కిందకు దిగారు. ఫాస్ట్ ట్రాక్ రీఛార్జ్ చేస్తున్న సమయంలో కారులో నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.