పారిశుద్ధ్య నిర్వహణలో శ్రీకాకుళం నగరం దేశంలోనే టాప్ టెన్ జాబితాలో చోటు సంపాదించాలని, స్వచ్ఛ శ్రీకాకుళం నిర్మాణం అందరి బాధ్యత కావాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు బుధవారం అన్నారు. ఈ మేరకు గాంధీ జయంతిని పురష్కరించుకొని స్వచ్ఛతా హి సేవ ముగింపు కార్యక్రమంలో భాగంగా డచ్ బంగ్లా వద్ద ఏర్పాటు చేసిన అవార్డుల ప్రధాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.