లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమాలు

72చూసినవారు
లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమాలు
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు "స్వచ్ఛత హి సేవ" కార్యక్రమం నిర్వహించామని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ సూర్య కిరణ్ తెలిపారు. ఆదివారం శ్రీకాకుళం పట్టణంలో జరిగిన కార్యక్రమంలో భాగంగా ర్యాలీలు, మానవ హారాలు, మొక్కలు నాటే కార్యక్రమం, పరిసరాలు పరిశుభ్ర పరుచుకోవడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ రీజినల్ మేనేజర్ వెంకట తిలక్, లీడ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్