త్రైమాసిక తనిఖీలలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఈవిఎం గోదాములను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సోమవారం తనిఖీ చేశారు. గోదాములకు వేసిన సీళ్లను వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి సిబ్బందితో తెరిపించి పరిశీలించారు. అనంతరం వాటికి తిరిగి సీళ్లు వేయించారు. ఎన్నికల్లో వినియోగించిన, రిజర్వులో ఉంచిన ఈవిఎంలను సీరియల్ నెంబర్, నియోజకవర్గాల వారీగా ఏ ఏ ప్రదేశాల్లో ఉంచారో అడిగి తెలుసుకున్నారు.