శ్రీకాకుళం అరసవిల్లి రథసప్తమి వేడుకలలో భాగంగా అర్ట్స్ కళాశాల ఆవరణలో సింగర్ మంగ్లి సోమవారం ప్రత్యక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకను వీక్షించేందుకు జనాలు భారీగా తరలివచ్చారు. మంగ్లి టీమ్ గానం చేసేందుకు సిద్ధంగా ఉంది. రథసప్తమి రాష్ట్ర వేడుకలకు శ్రీకాకుళంలో విశేష స్పందన లభించిందని స్థానికులు తెలిపారు.