శ్రీకాకుళం నగరంలోని బలగలోని నాగావళి నదీ తీరాన వెలసిన శ్రీ బాలా త్రిపుర సుందరి కాలభైరవ ఆలయంలో గణేష్ గురువు ఆధ్వర్యంలో శ్రావణమాస పూజలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ఐదులక్షల గాజులతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. అదే విధంగా అమ్మవారికి 120 రకాల పిండి వంటలతో నైవేద్యాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా అమ్మవారిని ఎమ్మెల్యే గొండు శంకర్ దర్శించుకున్నారు.