ఆముదాలవలస ఎమ్మెల్యే, పియూసీ చైర్మన్ కూన రవికుమార్ శుక్రవారం ఉదయం 9: 30 గంటలకు ఆమదాలవలసలో ఉన్న కృషి విజ్ఞాన్ కేంద్రంలో వ్యక్తిగత రాయితీపై వ్యవసాయ పరికరాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. తదనంతరం 10. 30 గంటలకు సరుబుజ్జిలి మండలం కొత్తకోట గ్రామపంచాయతీ ఎబి రోడ్డు నుండి కొత్తకోట గ్రామము వరకు సీసీ రోడ్డు, రక్షణ గోడ నిర్మాణ పనుల శంఖుస్తాపన కార్యక్రమంలో పాల్గొంటారు అని ఎమ్మెల్యే కార్యాలయం గురువారం ఒక ప్రకటన విడుదల చేసారు.