సిబ్బందికి క్రమశిక్షణ చాలా ముఖ్యం

84చూసినవారు
సిబ్బందికి క్రమశిక్షణ చాలా ముఖ్యం
ఎచ్చెర్లలోని స్థానిక జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు మైదానంలో పోలీస్ పరేడ్ కార్యక్రమాన్ని శుక్రవారం ఉదయం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా అదనపు ఎస్పీ జి. ప్రేమ్ కాజల్ పరిశీలించారు. ఈ సందర్బంగా ఏఎస్పీ మాట్లాడుతూ పోలీసు శాఖలో సిబ్బందికి క్రమశిక్షణ చాలా ముఖ్యమని అన్నారు. శారీరక, మానసిక దృఢత్వం ఉన్నప్పుడే ఉత్సాహంగా ప్రజలకు సేవలు అందించగలమని పేర్కొన్నారు. ఈ క్రమంలో సిబ్బందికి పలు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్