ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలని మాజీ ఎంపీ, ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచ్ జాతీయ కో-చైర్మన్ ఎం. బాబూరావు డిమాండ్ చేశారు. బుధవారం శ్రీకాకుళం నగరంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో సీతంపేట ఐటీడీఏ ఉందన్నారు. మన్యం జిల్లాలో సీతంపేట ఐటీడీఏను విలీనం చేయడంతో ఆదివాసీల కోసం జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేస్తామన్నారు.