అల్పపీడనం ప్రభావంతో రానున్న రెండు రోజులు పాటు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయనే అంచనాల నేపథ్యంలో యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉండాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచించారు. ప్రతీ మండల కేంద్రంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గురువారం సాయంత్రం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ కలెక్టరేట్ కంట్రోల్ రూం ఫోన్ నంబర్ 08942-240557 ఏర్పాటు చేశారు.