కార్పొరేట్లకు ప్రయోజనం చేకూర్చే విధంగా కేంద్ర బడ్జెట్ ఉందని, సామాన్యులకు ఏటువంటి ప్రయోజనం లేదని సిఐటియు జిల్లా అధ్యక్షులు సి. హెచ్. అమ్మన్నాయుడు అన్నారు. రైతు, సామాన్యుల వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల కేంద్ర బడ్జెట్ కు వ్యతిరేకంగా చిలకపాలెంలో ఎపి రైతు సంఘం, సిఐటియు ఆధ్వర్యంలో బడ్జెట్ పత్రాలను బుధవారం దహనం చేసారు. ఉపాధి హామీకి గత బడ్జెట్లో రూ. 86 వేల కోట్లు ఇచ్చారని, ఇప్పుడు కూడా రూ. 86 వేల కోట్లని అన్నారు.