ఎచ్చెర్ల: ఎస్సీ, ఎస్టీ కేసులో జైలు శిక్షతో పాటు జరీమానా

77చూసినవారు
ఎచ్చెర్ల: ఎస్సీ, ఎస్టీ కేసులో జైలు శిక్షతో పాటు జరీమానా
తెప్పలవలస గ్రామంలో 2020 సంవత్సరంలో అప్పటి వీఆర్వోపై సరిహద్దు రాళ్ళ అంశంలో గ్రామానికి చెందిన 9 మంది విధులకు అటంకం కలిగించి కులం పేరుతో దుషించారు. ఎస్సై శ్రీనివాస రావు కేసు నమోదు చేయగా, డీఎస్పీ మహేంద్ర దర్యాప్తు  చేపట్టారు. ఈ క్రమంలో బలగ చిరంజీవిపై కోర్టులో శుక్రవారం నేరం రుజువైంది.  2సంవత్సరాలు  జైలు శిక్ష, రూ 11000 జరిమానాను కోర్టు విధించింది. మిగిలిన వారిపై కేసు కొట్టివేసినట్లు  జే ఆర్ పురం ఎస్ఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్