శ్రీకాకుళం ప్రత్యక్షదైవం ఆరోగ్య ప్రదాత శ్రీ అరసవల్లి సూర్యనారాయణస్వామి దేవాలయంలో రథసప్తమిని పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు కుటుంబ సమేతంగా దేవాలయానికి తరలి వచ్చారు. ముందుగా అనివెట్టి మండప వద్ద ఎమ్మెల్యే సూర్య నమస్కారాలు చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. ఆయనకు వేద పండితులు ఆశీర్వచనాలు తీర్థ ప్రసాదాలు అందజేశారు.