జి. సిగడాం - పొందూరు మండలాల సరిహద్దులోని మడ్డువలస కాలువ పనులు తిరిగి మొదలుపెట్టే ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు అన్నారు. ప్రాజెక్టు ఫేస్-2లో సాంకేతిక అంశాలు, బడ్జెట్ లో నిధుల కేటాయింపు సమస్యల వల్ల సగం వరకు నిలిచిపోయిన ఈ ప్రాజెక్టును తిరిగి చురుగ్గా ముందుకు తీసుకెళ్లే దిశగా కృషి చేస్తున్నట్టు చెప్పారు. ఆదివారం పలు ప్రాంతాల్లో రైతులతో కలిసి కాలువను పరిశీలించారు.