శ్రీకాకుళం అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయానికి రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, నరసన్నపేట మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణ దాస్ చేరుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం సాయంత్రం ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆయనతోపాటు మాజీ ఎమ్మెల్యే కళావతి, ఎంపీపీలు మురళీధర్, వాన గోపి, పలువురు నాయకులు పాల్గొన్నారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.