శ్రీకాకుళం డా. బి. ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో బుధవారం మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు వైస్-ఛాన్సలర్ ఆచార్య కె. ఆర్. రజని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. సత్యం ఆయుదంగా చేసుకొని స్వాతంత్య్ర సమరాన్ని నడిపించారన్నారు. ఈ కార్యక్రమంలో వర్శిటీ ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.