మహాత్మా గాంధీ చూపిన బాట మనందరికీ ఆదర్శమని ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి బుధవారం పేర్కొన్నారు. ఈ మేరకు శ్రీకాకుళం నగరంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సత్యం, అహింస సిద్ధాంతాలను ఆయుధాలుగా స్వాతంత్ర ఉద్యమంలో శాంతియుత సమాజం స్థాపనలో కీలక పాత్ర పోషించారన్నారు. ప్రతి ఒక్కరూ గాంధీజీ ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు.