విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ గార మండలం కళింగపట్నం మెరైన్ పోలీస్ స్టేషన్ ను మంగళవారం తనిఖీ చేసి, పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి భద్రత దృష్ట్యా తీర ప్రాంత ముందస్తు సమాచార సేకరణ విషయమై ఆరా తీసి, తీరా ప్రాంతంలో గస్తీ పెంచుతూ భద్రత పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. సముద్రతీర ప్రాంతంలో అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా పెట్టాలన్నారు.