గార ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో ఉన్న పలు అంగన్వాడీ కేంద్రాలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాన్ ఆధ్వర్యంలో వంట సామగ్రిని గురువారం అందించారు. ఈ ప్రాజెక్ట్ పరిధిలో ఉన్న బావాజీపేట, అంబటివానిపేట కేంద్రాలకు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్, వాటర్ ఫిల్టర్, ఇతర సామగ్రి, అంగన్వాడీ పిల్లలకు అవసరమైన ఆట వస్తువులను ఎస్బీఐ అధికారులు అందించారు.