గార మండలం లింగాలవలస గ్రామంలో బుధవారం 104సిబ్బంది ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ మేరకు సిబ్బంది ఆధ్వర్యంలో వైద్యులు డాక్టర్ వి.వి.ఎస్.ఎన్. మూర్తి రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. అనంతరం సీజనల్ వ్యాధులు, పరిశుభ్రత, ఆహారపు అలవాట్లపై వివరించారు. ఈ కార్యక్రమంలో విశ్వ, ఏఎన్ఎం ప్రభావతి, హెల్త్ అసిస్టెంట్ మన్మధరావు, 104డిఈవో శ్రీనివాస్, ఆశా కార్యకర్తలున్నారు.