రానున్న నాలుగు రోజులు గార మండలంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముంది. ఈ మేరకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. వర్షాల సమయంలో గంటకు 30-40 కిమీ వేగంతో గాలులు వీస్తాయని సామాజిక మాధ్యమం ఎక్స్ అధికారిక ఖాతా ద్వారా శుక్రవారం పేర్కొంది. పిడుగులతో కూడిన వర్షాలు వచ్చే అవకాశం ఉండటంతో, ప్రజలు కరెంట్ స్తంభాల వద్ద ఉండకూడదని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ సూచించారు.