గార మండలం కోరాడ పేట సమీపంలో శుక్రవారం 200 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం చేసినట్లు ఎస్ఐ ఆర్. జనార్ధనరావు తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు దాడులు నిర్వహించామన్నారు. సారా తయారీ కోసం రెండు ప్లాస్టిక్ డ్రమ్ములో ఉన్న ఊటను ధ్వంసం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ జనార్ధనరావు తెలిపారు.