గార మండలంలోని చిన్న వత్సవలసలో కొలువైన రాజమ్మతల్లి జాతర నేటి నుండి మొదలు కానుంది. నేటి నుండి పది వారాల పాటు ఘనంగా జరిగే ఈ జాతరకి వచ్చే భక్తులు ఇక్కడే బస చేసి రాజమ్మతల్లితో పాటు భూలోకమ్మతల్లిని ఆదివారం దర్శించుకుని మొక్కలు తీర్చుకుంటారు. వేకుజామున సమీపంలోని సముద్ర స్నానమాచరించి కుటుంబ సమేతంగా ఇక్కడే వంట చేసుకుంటారు. ఈ జాతరకు ఏడాదికి ఒకసారైన రావాలన్న నిబంధన ఉంది.